తూర్పు గోదావరి జిల్లా అమలాపురం తహసీల్దార్ కార్యాలయాన్ని.. సమనస గ్రామ రైతులు ముట్టడించారు. తమ గ్రామంలో వక్ఫ్ బోర్డు భూములు.. తాము 1930 నుంచి సాగు చేసుకుంటున్నామని ఇప్పుడు వీటికి కౌలు ఇచ్చేందుకు బహిరంగ వేలం నిర్వహించడం సమంజసం కాదని రైతులు ఆవేదన చెందారు. రైతులు తహసీల్దార్ కార్యాలయం లోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. 1930 నుంచి వక్ఫ్ బోర్డు భూములు తాము సాగు చేసుకుంటున్నామని రైతులు తెలిపారు.
ఇప్పుడు ప్రభుత్వం లాగేసుకుని కౌలు ఇచ్చేందుకు బహిరంగ వేలం నిర్వహించడం న్యాయం కాదని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం చేసే పనులతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. అయితే ఈ భూములపై వారికి ఎలాంటి హక్కు లేదని తహసీల్దార్ ఠాగూర్ వెల్లడించారు. నిబంధనల మేరకు ఈ భూములకు సంవత్సరం పాటు లీజుకు ఇచ్చే విధంగా సాగు చేసుకునేందుకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నామని.. ఆయన రైతులకు వివరించారు. దీనిని నిలుపుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: