ETV Bharat / state

చెరువుల్లా మారిన పొలాలు... వేల ఎకరాల్లో పంట నీటి పాలు - farmers

గోదావరి నది ఉద్ధృత ప్రవాహానికి తూర్పుగోదావరి జిల్లాలోని మన్యంతోపాటు కోనసీమ భయభ్రాంతులకు గురైంది. ఆదివారం నుంచి గోదావరి శాంతించినప్పటికీ వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు చక్కబడటానికి చాలా సమయం పడుతుంది. చేతికందే సమయంలో వేల ఎకరాల్లో పంట నష్టపోయి రైతులు ఆవేదనకు గురవతున్నారు.

కోనసీమ
author img

By

Published : Aug 14, 2019, 4:18 PM IST

చెరువుల్లా మారిన పొలాలు... వేల ఎకరాల్లో పంట నీటి పాలు

గోదావరి నది వరద ప్రవాహం కారణంగా తూర్పు గోదావరి జిల్లాలో వేల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. కోనసీమలోని అన్నదాతలకు గోదారమ్మ ఉగ్ర ప్రవాహం తీరని కష్టం మిగిల్చింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 15లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేయటంతో... దిగువ ప్రాంతాల్లోని పంట చేలు చెరువులను తలపించాయి. తొలకరిలో వేసిన వరితోపాటు ఉద్యానపంటలు సైతం వరద ముంపులో మునిగిపోయాయి. అమలాపురం డివిజన్​లోని అత్యధిక ప్రాంతాలు రోజుల తరబడి వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. దీనివల్ల అన్ని రకాల కూరగాయల పంటలు నీటిపాలయ్యాయి.
పి.గన్నవరం మండలం ఊడుమూడి లంక, బూరుగుల లంక పరిసర ప్రాంతాల లంకల్లోని పంటలకు అపార నష్టం వాటిల్లింది. పది రోజుల వేగవంతమైన నదీ ప్రవాహానికి... బెండ, వంగ, అనప పాదులు వరదలో తేలియాడాయి. వేల రూపాయలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన పంట... చేతికందే సమయానికి నీటి పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ముంపుతో నష్టపోయిన తమకు ప్రభుత్వం సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గోదావరి ప్రకోపంతో ప్రతి సంవత్సరం నష్టపోతున్నామని కోనసీమ రైతులు వాపోతున్నారు. నష్టపోయిన పంటకు అధికారులు, ప్రజాప్రతినిధులు పరిహారం అందించి ఆదుకుంటే తప్ప కోలుకునే పరిస్థితి లేదంటున్నారు.

Intro:డియస్పిగా బాద్యతలుస్వకరణBody:ఆత్మకూరు నూతన డిఎస్పీగా మక్బుల్ .
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నూతన డి.ఎస్.పి గా ఎస్.మక్బుల్ గారు నేడు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని నగర క్రైమ్ డిఎస్పి గా విధులు నిర్వహిస్తూ బదిలీపై ఆత్మకూరు పోలీస్ డివిజనల్ డిఎస్పీగా నేడు జాయిన్ అయ్యారు..ఆత్మకూరు, పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ లు పాపారావు, గంగాధర్ లు మరియు ఆత్మకూరు పోలీస్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్.ఐ.లు డి.ఎస్.పి గారిని కలిసి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు..Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.