తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాలలో నాటు సారా బట్టీలపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోని 2600 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ మాడి రామకృష్ణ దాస్, జగ్గంపేట పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నాటుసారా బట్టీలపై ఎక్సైజ్ దాడులు...2600 లీటర్ల ఊట ధ్వంసం - xcise police raids in jaggampeta
అక్రమంగా నాటుసారా కాస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జగ్గంపేట సీఐ రాంబాబు తెలిపారు. నాటుసారా కాస్తున్న వారి ఆచూకీ తెలియజేయాలని కోరారు. ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. జగ్గంపేట మండలం మల్లిసాల నాటు సారా బట్టీలపై దాడులు చేసి 2600 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేశామని ప్రకటించారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న బెల్లపు ఊటలు
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాలలో నాటు సారా బట్టీలపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోని 2600 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ మాడి రామకృష్ణ దాస్, జగ్గంపేట పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నీటి వనరులున్నా.. తాగు నీటికి కటకటే..!