ETV Bharat / state

'అవినీతి ఆరోపణలు ఆపాదించి అచ్చెన్నాయుడిని అరెస్ట్​ చేశారు' - అచ్చెన్నాయుడి అరెస్ట్​పై రాజమహేంద్రవరంలో మాజీ ఎమ్మెల్సీల వ్యాఖ్యలు

అవినీతి ఆరోపణలు ఆపాదించి తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అరెస్ట్​ చేశారంటూ... మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిని ఎక్కడ ప్రశ్నిస్తాడోనని భయపడి అతనిని అరెస్టు చేశారని ఆదిరెడ్డి విమర్శించారు.

ex mlc aadireddy reacts on ycp government
అచ్చెన్నాయుడి అరెస్ట్​పై మాజీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు
author img

By

Published : Jun 15, 2020, 7:44 PM IST

తెదేపా సీనియర్​ నేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి అరెస్ట్​పై తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు స్పందించారు. అవినీతి ఆరోపణలు ఆపాదించి, నోటీసులు ఇవ్వకుండా, విచారణ లేకుండా అతన్ని జైలుకు తీసుకెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. తెల్లవారుజామున 300 మంది పోలీసులు చుట్టుముట్టి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. సంవత్సర కాలంలో జరిగిన ప్రభుత్వ అవినీతిపై అచ్చెన్నాయుడు గళం విప్పి నిలదీస్తారనే భయంతో ఆతన్ని అరెస్టు చేశారన్నారు. వైకాపా ప్రభుత్వం కరోనా కిట్లు కొనుగోళ్లు, సచివాలయాలకు పార్టీ రంగులు విషయంలో ప్రజాధనం దుర్వినియోగానికి బాధ్యులైన వారినీ... జైలుకు పంపుతారా? అని ఆయన ప్రశ్నించారు.

ఇదీ చూడండి:వైకాపా విధ్వంసాలపై కలెక్టర్​కు తేదేపా నాయకుల వినతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.