ETV Bharat / state

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అరెస్టు.. తెదేపా శ్రేణుల ఆందోళన - పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అరెస్టు తాజా వార్తలు

అధికారులు అనుమతులు ఇవ్వకపోయినా పాదయాత్ర చేసేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ... పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, తెదేపా శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. తెదేపా నేతలు కోటగుమ్మం సెంటరులో బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు.

ex mla varma arrested by the police
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అరెస్టు
author img

By

Published : Nov 1, 2020, 11:37 AM IST

ఏలేరు ఆధునీకరణ పనులు ప్రారంభించాలంటూ పాదయాత్ర చేపట్టిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను పోలీసులు అరెస్ట్​ చేశారు. పాదయాత్రకు అధికారులు అనుమతి నిరాకరించడంతో పిఠాపురం కోటగుమ్మం సెంటర్​లో ఉన్న తెదేపా కార్యాలయానికి పోలీసులు భారీగా చేరుకున్నారు.

అనుమతులు రాకపోయినా పాదయాత్ర చేసి తీరుతానని వర్మ.. నాయకులు, కార్యకర్తలను కలుపుకొని యాత్ర ప్రారంభించారు. దీంతో పోలీసులు వర్మను అరెస్ట్​ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు. రైతుల సమస్యల కోసం పోరాడుతుంటే అనుమతి ఇవ్వలేదని, అధికార పార్టీ సభలకు సమావేశాలకు మాత్రం అనుమతులు ఇస్తున్నారని వర్మ ఆరోపించారు.

ఇవీ చూడండి:

తూర్పు మన్యంలో ఘనంగా వాల్మీకి జయంతి ఉత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.