గత ప్రభుత్వ హయాంలో కాపులకు ఈబీసీ కోటా ద్వారా కల్పించిన 5 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు డిమాండ్ చేశారు. కాపులను ప్రతిపార్టీ ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుందని... ఒక్క చంద్రబాబు నాయుడే కాపులను గుర్తించారన్నారు. కాపులను బీసీలలో చేరుస్తానని మాటిచ్చిన ప్రకారమే వారికి కాపు కార్పొరేషన్ ఏర్పరచి.., అత్యధికంగా రుణాలు మంజూరు చేశారన్నారు.
వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ ద్వారా ఇవ్వాల్సిన రుణాలు ఇంత వరకు ఇవ్వలేదన్నారు. కాపు విద్యార్థులు, మహిళల కోసం తెదేపా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు. వైకాపా మాత్రం అన్నివర్గాల మహిళల ఇచ్చే రూ.15 వేల పథకాన్ని ప్రవేశపెట్టి గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. వైకాపా ప్రభుత్వంలోని కాపు మంత్రులు కాపులకు 5 శాతం రిజర్వేషన్లను కల్పించేలా సీఎం జగన్ ఒప్పించాలని హితవు పలికారు.