ETV Bharat / state

అగమ్యగోచరంగా జగనన్న కాలనీల పథకం: మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి - వైఎస్సార్ జగనన్న కాలనీల పథకం

పేదల ఇళ్ల నిర్మాణానికి తాను ఎన్నడూ వ్యతిరేకం కాదని.. అందులో జరిగిన అక్రమాలకు మాత్రమే వ్యతిరేకమని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆచరణకు సాధ్యం కాని విధానాలతో 'వైఎస్సార్ జగనన్న కాలనీల పథకం' అగమ్యగోచరంగా మారిందని ఆరోపించారు.

comments on jagananna colonies scheme
అగమ్యగోచరంగా జగనన్న కాలనీలు పథకం
author img

By

Published : Jul 5, 2021, 12:39 PM IST

జగనన్న కాలనీల పథకం.. ఆచరణ సాధ్యం కాని విధానాలతో అగమ్యగోచరంగా మారిందని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇళ్లు నిర్మిస్తే తిరిగి తీసుకుంటామని లబ్ధిదారులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. లేఅవుట్లలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా ఇళ్ల నిర్మాణాలు ఎలా చేపడతారని ప్రశ్నించారు. పేదల గృహ నిర్మాణాలకు తాను వ్యతిరేకం కాదని.. అందులో జరిగే అక్రమాలను మాత్రమే వ్యతిరేకిస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు.

తాను కోర్టుకు వెళ్లడం వల్లనే ఇళ్లపట్టాలు ఇవ్వలేకపోతున్నామని ఓ ఎమ్మెల్యే చెప్పడం సరైందికాదన్నారు. కోర్టుకు వెళ్లినట్లు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతా.. మీరు పదవికి రాజీనామా చేస్తారా అని రామకృష్ణారెడ్డి సవాల్‌ విసిరారు.

ఇదీ చదవండి..

curfew: కర్ఫ్యూ సడలింపుపై సీఎం నిర్ణయం తీసుకోనున్నారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.