రాజమహేంద్రవరంలో స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రైవేట్ ఉపాధ్యాయులకు నిత్యావసర సరకులు, 500 రూపాయల నగదు పంపిణీ చేశారు. లాలాచెరువులోని స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 54 మంది ఉపాధ్యాయులకు వీటిని అందజేశారు. సంస్థ ఛైర్మన్ గుబ్బల రాంబాబుతో పాటు ఎల్ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ రామయ్య కిట్‌లను పంపిణీ చేశారు. ఈ సంస్థ ద్వారా నిరంతరాయంగా సేవలు అందించడం హర్షనీయమని ఆయన అన్నారు.
ఇదీ చదవండి