ETV Bharat / state

రైతులను కోలుకోలేని దెబ్బతీసిన ఏలేరు... 37 చోట్ల గండి

పచ్చని కొండలు.. ప్రకృతి రమణీయతల మధ్య సహజ సిద్ధంగా ఏర్పడింది ఏలేరు జలాశయం. తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో ఏర్పడిన ఏలేరు జలాశయం జగ్గంపేట, ప్రత్తిపాడు, పెద్దాపురం, పిఠాపురం, కాకినాడ నియోజక పరిధిలోని 8 మండలాల్లో విస్తరించింది. ఇటీవల కురిసిన వర్షాలకు జలాశయం పరిసర ప్రాంతాల్లోని పొలాలు నీట మునిగాయి.

Eleru Reservoir
ఏలేరు జలాశయం
author img

By

Published : Oct 26, 2020, 2:49 PM IST

8మండలాల్లో విస్తరించి ఉన్న ఏలేరు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరడం వేల ఎకరాల్లో వరి, పత్తి, ఉద్యానపంటలు జలమయమయ్యాయి. గొల్లప్రోలు, కాకినాడ గ్రామీణ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు వారానికిపైగా వరద నీటిలోనే ఉండిపోయాయి. ఏలేరు కాలువకు 37 చోట్లకుపైగా గండిపడి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది.

ఏలేరు జలాశయం

ఏమేరకు పనులు పూర్తి...

ఏలేరు జలాశయం పూర్తి నీటి సామార్ధంయ 24.11 టీఎంసీలు. ఏలేరు కాలువలపైనే ఏకంగా 57 ఎకరాల భూమి సాగు అవుతుంది. జలాశయం ఆధునీకరణ పనులు ఆరేళ్ల క్రితం చేపట్టి, తొలిదశలో భాగంగా 127 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించగా ఇప్పటివరకు కేవలం 52 శాతం పనులు పూర్తయ్యాయి. తొలి దశ పనులు 92 శాతం వరకు పూర్తి అయినా.. కాలువాల ఆధునీకరణ పనులు 10శాతం కూడా పూర్తి కాలేదు. ఇందుకు ముఖ్యంగా కాలువల విస్తరణలో భూసేకరణ ముందుకు సాగకపోవడం పెద్ద సమస్యగా మారింది. కొన్ని ప్రాంతాల్లో కాలువ ఆక్రమణకు గురైనా కనీసం తాత్కాలిక పనుకు కూడా చేపట్టలేదు. ఫలితంగా భారీ వర్షాలకు వేలాది ఎకరాల పంటలను, లోతట్టు ప్రాంతంలో ఉన్న జనావాసాలను ముంచెత్తింది.

చేయాల్సిన భూసేకరణ...

కిర్లంపూడి మండలంలోని ఎస్ తిమ్మాపురం నుంచి రాజుపాలెం వరకు ఎర్ర కాలువను విస్తరించాల్సి ఉంది. ముక్కోళ్లు నుంచి పిఠాపురం మండలం ఇల్లింత్రాడ వరకు ఉన్న కండికాలువను ప్రధాన వరద కాలువగా విస్తరించాల్సి ఉంది. ఇందు కోసం కిర్లంపూడి మండలంలో 104 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. పిఠాపురంలో 138 ఎకరాల వరకు భూ సేకరణ జరగాల్సి ఉంది. పెద్దాపురం, ఏలేశ్వర మండలాల్లోనూ మరో పది ఎకరాల భూమి సేకరించాలి. ఇవన్నీ పూర్తి చేసి ఏలేరు ఆధునీకరణ పనులు పూర్తైతే మరో 10వేల ఎకరాలకు నీరు ఆందుతుంది.

ఇప్పటికైనా ఏలేరు ఆధునీకరణ పనులు చేపట్టి వేల ఎకరాల్లో పంట నీట మునగకుండా కాపాడాలని రైతులు కోరుతున్నారు.

ఇవీ చూడండి...

యానంలో ముగిసిన శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.