తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాసర్లపూడిలో విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన బొంతు సత్తిబాబు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా బుధవారం విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై తీవ్రగాయలతో స్తంభంపైనే వాలిపోయాడు. వెంటనే స్థానికులు గమనించిన బాధితుడ్ని కిందకు దించి హుటాహుటిన రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండటంతో బాధితుడ్ని మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడకు తరలించారు. లైన్ మెన్ చేయవలసిన పని కాంట్రాక్ట్ ఎలక్ట్రీషియన్‌తో చేయించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: సాధారణ రోగులకు లేని పడకలు.. రిక్షాలోనే చికిత్స