పిగన్నవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ జయంతి ఘనంగా జరిపారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా జగన్నాథం ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పలుచోట్ల పలువురు తెదేపా నాయకులు పార్టీ పతాకాలను ఆవిష్కరించారు
కొత్తపేట నియోజక వర్గంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జగ్గంపేట నియోజకవర్గంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 97వ జయంతి వేడుకలు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన ఘనంగా జరిపారు. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు... యుగపురుషుడు... విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్షేమ పథకాలు ఏమిటో తెలియజేసిన మహా నాయకుడను ఎన్టీఆర్ అని జ్యోతుల నెహ్రూ కొనియాడారు.
ప్రత్తిపాడు నియోజకవర్గం వ్యాప్తంగా తెదేపా శ్రేణులు ఎన్టీఆర్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు.. స్థానిక తెదేపా నియోజకవర్గం ఇంచార్జ్ వరుపుల రాజా ఆధ్వర్యంలో ప్రత్తిపాడు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి ఘన నివాళి అర్పించారు.
ఇద చదవండి :