ETV Bharat / state

తూర్పుగోదావరి జిల్లాలో వాడవాడలా కార్మిక దినోత్సవం - EAST GODAVARI MAY DAY CELEBRETAIONS

తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వాడవాడలో జెండాలు ఎగుర వేసి, ర్యాలీలు చేపట్టారు.

తూర్పుగోదావరిజిల్లాలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం
author img

By

Published : May 1, 2019, 5:29 PM IST

తూర్పుగోదావరిజిల్లాలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం
తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వాడవాడలో జెండాలు ఎగుర వేసి ర్యాలీలు చేపట్టారు. ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని 4 మండలాల్లో మే డేను పురస్కరించుకుని కార్మికులు వేడుకలు నిర్వహించారు. జిల్లాలో అంతర్భాగంగా ఉన్న యానాంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద "చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ" విష్ణువర్ధన్ రావు జెండాను ఆవిష్కరించారు. తాళ్ళరేవు మండలంలో రైతు కూలీల సంఘం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ర్యాలీ చేపట్టారు. రైస్ మిల్లులో పని చేస్తున్న కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఇతర కార్మికులంతా హాజరయ్యారు.

రాజమహేంద్రవరంలో భారీ ర్యాలీ...
కార్మిక దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలోని ఏఐయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఇన్నీస్​పేటలోని సీపీఐ కార్యాలయం నుంచి జాంపేట, కంబాల చెరువు, నందం గనిరాజు సెంటర్, బైపాస్ రోడ్డు మీదుగా తాడితోట వరకు ర్యాలీ చేపట్టారు. నృత్యాలు,నినాదాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ర్యాలీ సాగింది. ఈ ప్రదర్శనలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కోనసీమ ముఖద్వారమైన రావులపాలెంలో మే డే వేడుకలను కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. కొబ్బరి కార్మికులు, ఆర్టీసీ, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, సీపీఐ నాయకులు పాల్గొని కార్మిక జెండాను ఎగురవేశారు. జిల్లాలోని గోకవరం మండలంలో "మేడే" వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యుత్ శాఖలోని కార్మికులు గోకవరంలో ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ ఉపకేంద్రం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ టవర్ స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Intro:ap_cdp_16_01_may_day_rally_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
శ్రామిక వర్గాన్ని ఉండేది ది ఎర్రజెండా ఒక్కటేనని సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. కార్మిక వర్గాన్ని విచ్చిన్నం చేయడానికి కొన్ని పార్టీలు కార్మిక సంఘాలను పెడుతున్నారని ఆరోపించారు. మేడే సందర్భంగా కడపలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ నగర వీధుల్లో తిరుగుతూ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నినాదాలు వ్యక్తం చేశారు. 16 గంటల పని దినాన్ని కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎనిమిది గంటలకు సాధించుకున్నారని చెప్పారు. అయినప్పటికీ కొన్ని సంస్థల్లో పదహారు గంటలు కూడా పని చేయించుకుంటున్నారని ఆరోపించారు.
byte: ఈశ్వరయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి, కడప.

Body:మే డే ర్యాలీ

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.