వైకాపా నేతల అక్రమాలపై తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో తెదేపా నాయకులు కార్యకర్తలు ఉప తహసీల్దార్ గోపాల్రావుకు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవోకు వినతిపత్రం అందించారు. ఇళ్ల స్థలాల మెరక పేరుతో మట్టి అక్రమ రవాణా చేస్తున్నారని, వాటిని వెంటనే అడ్డుకుని శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు, సీనియర్ నాయకులు ఆకుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు పిల్లలు సహా పది మంది మృతి