ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందించాల్సిన బాధ్యత గ్రామ సచివాలయ సిబ్బంది పైనే ఉందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అన్నారు. గంగవరం ఏజెన్సీ ప్రాంతంలో ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ ఛైర్మన్ అనంత ఉదయభాస్కర్తో కలిసి పర్యటించారు.
గొరగొమ్మి వెంకటరామపురంలో ఉన్న ఎంపీపీ పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు పనులను పరిశీలించారు. అనంతరం గంగవరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవలు పై ఆరా తీశారు.
ఇదీ చూడండి