Police Case Filed On Chandrababu : పోలీసులను తోసుకుంటూ వెళ్లటం వల్లనే చంద్రబాబుపై కేసు నమోదు చేశామని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. అనపర్తి బహిరంగ సభ నిర్వహించనున్న కారణంగా అనుమతి కోరగా.. సభ నిర్వహించే ప్రాంతం ఇరుకుగా ఉండటంతో అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని అనుమతులు ఇవ్వలేదని అన్నారు. అయినప్పటికి సభ నిర్వహించరాని అన్నారు. ప్రత్యామ్నయంగా వేరే ప్రదేశంలో సభ నిర్వహించమని సూచించినప్పటికి.. రహదారిపైనే సభ నిర్వహించారని వివరించారు. ఇరుకుగా ఉన్న ప్రదేశంలోనే సభ నిర్వహిస్తున్నరన్న సమాచారం రావటంతోనే పోలీసులు సభను అడ్డుకున్నారు. దీనిలో చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వివరించారు. చట్ట ప్రకారమే ముందుకు వెళ్తామని తెలిపారు. గోకవరంలో కూడా అనుమతులు కోరగా.. ఇచ్చిన తర్వాత అక్కడ కార్యక్రమాలు సజావుగా నిర్వహించారు.
"మాజీ ముఖ్యమంత్రి రోడ్ షోకు అనుమతులు కావాలని అనుమతులు కోరారు. దీంతో వారికి షరతులతో కూడిన అనుమతులు ఇచ్చాము. ఇరుకుగా ఉన్న రోడ్డులో ఎక్కువ మందితో సభ నిర్వహించకూడదని.. ర్యాలికి అనుమతి ఇచ్చాము. బహిరంగ సభకు అనుమతులు ఇవ్వలేదు. ఇరుకుగా ఉన్న రోడ్డులో సభ నిర్వహిస్తున్నారనే సమాచారంతో.. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని అడ్డుకోవటం జరిగింది." -సుధీర్ కుమార్ రెడ్డి, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ
అసలు ఏం జరిగిదంటే : తూర్పు గోదావరి జిల్లాలో నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. అందులో భాగంగా అనపర్తిలో బహిరంగ సభ నిర్వహించాటానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి పోలీసులు మొదట అనుమతులు ఇచ్చిన.. తర్వాత బహిరంగ సభను అడ్డుకోవటానికి ప్రయత్నించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు పోలీసుల చర్యలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అంతేకాకుండా అనపర్తి సభలో పాల్గొనటానికి సామర్లకోట నుంచి వస్తున్న చంద్రబాబును.. పోలీసులు బలభద్రపురం వద్ద అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో బలభద్రపురంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
ఇవీ చదవండి :