ETV Bharat / state

దొంగ నోట్లు ముద్రించి.. చలామణీ చేస్తున్న ముఠా అరెస్ట్ - దొంగనోట్ల ముఠా అరెస్ట్ తాజా న్యూస్

దొంగ నోట్లు ముద్రించి చలామణీ చేస్తున్న ముఠాను తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పోలీసులు పట్టుకున్నారు. ఇంక్ జెట్ ప్రింటర్, ఎగ్జిక్యూటివ్ బాండ్ పేపర్, దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు.

East Godavari district Sitanagaram police have arrested a gang involved in printing and circulating pirates
దొంగనోట్లను ముద్రించి.. చలామణీ చేస్తున్న ముఠా అరెస్ట్
author img

By

Published : Jan 24, 2021, 11:31 AM IST

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పోలీసులు.. దొంగనోట్ల ముఠా ఆట కట్టించారు. వెలంపేటకు చెందిన బూరెడ్డి శేఖర్​ను తనిఖీ చేయగా... దొంగనోట్లు బయటపడ్డాయని తెలిపారు. ఈ దందాతో సంబంధం ఉన్న అనపర్తి మండలం కుతుకులూరుకు చెందిన పడాలవెంకటరెడ్డి, బలభద్రపురానికి చెందిన కొవ్వూరి భీమారెడ్డిని అరెస్టు చేశామన్నారు. ఇంక్ జెట్ ప్రింటర్, ఎగ్జిక్యూటివ్ బాండ్ పేపర్, రూ. 24 వేల 400ల దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

కేసుకు సంబంధించి మొత్తంగా.. ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు.. రాజమహేంద్రవరం కోర్టులో హాజరుపరిచారు. వీరికి న్యాయస్థానం 15 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో మరికొందరిని అరెస్టు చేయాల్సి ఉందని ఎస్సై సుధాకర్ తెలియజేశారు.

ఇదీ చదవండి:

రాజానగరం వద్ద వాహనాల తనిఖీలు.. 400 కిలోల గంజాయి పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.