ETV Bharat / state

కన్నులపండుగగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవం

author img

By

Published : Nov 17, 2021, 9:36 AM IST

తూర్పుగోదావరిజిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది వశిష్టా నదిలో మంగళవారం సాయంత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

కన్నులపండుగగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవం
కన్నులపండుగగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవం
కన్నులపండుగగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవం

క్షిరాబ్ధిద్వాదశి వేడుకను పురస్కరించుకుని తూర్పుగోదావరిజిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది వశిష్టా నదిలో మంగళవారం సాయంత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత దేవాదాయశాఖ ఆధ్వర్యంలో పల్లిపాలెం అగ్నికులక్షత్రియులు స్వామివారిని గరుడ పుష్పక వాహనంలో పల్లిపాలెం మీదుగా స్థానిక వశిష్టా నది వద్దకు తీసుకొచ్చారు.. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యుత్ దీపాలతో అలంకరించిన తెప్పపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చి నదిలో సుమారు రెండు కిలోమీటర్లు బాణసంచా, బాజా భజంత్రీలతో విహరించారు.. తెప్పోత్సవం అనంతరం స్వామివారిని క్షిరాబ్ధిద్వాదశి మండపంలో ఉంచి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని క్షిరాబ్ధిద్వాదశి సందర్బంగా తెప్పోత్సవం ప్రారంభించి నేటికి 200 ఏళ్లు పూర్తయిందని నిర్వాహకులు తెలిపారు..ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

అన్నవరం సత్యనారాయణ స్వామి తెప్పోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. కొండదిగువున పంపా సరోవరం వద్ద జరిగిన వేడుకను వేలాది మంది భక్తులు కనులారా వీక్షించి పునీతులయ్యారు. సుందరంగా అలంకరించిన వేదిక పై స్వామి, అమ్మవార్లను ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విద్యుత్తు కాంతులతో సుందరంగా తీర్చిదిద్దిన హంస వాహనం పై స్వామి, అమ్మవార్లను పంపా రిజర్వాయర్ లో మూడు సార్లు ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఉత్సవాన్ని వీక్షించారు.

క్షిరాబ్ధిద్వాదశి వేడుకను పురస్కరించుకుని కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి తెప్పోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల నుంచి డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదావరి వద్దకు తీసుకువచ్చి వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోదావరిలో తెప్పోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇదీ చదవండి: కన్నుల పండువగా గోవిందరాజ స్వామి వారి తెప్పోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.