ETV Bharat / state

వరుస చోరీలకు పాల్పడిన వ్యక్తి అరెస్టు - వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు

ద్విచక్రవాహనాలు చోరీ చేస్తున్న వ్యక్తిని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 16 బైక్​లు స్వాధీనం చేసుకున్నారు.

వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు
author img

By

Published : Nov 13, 2019, 4:55 PM IST

వరుస చోరీలకు పాల్పడిన వ్యక్తి అరెస్టు

ద్విచక్రవాహనాలు ఎత్తుకెళ్తూ... చిక్కకుండా తిరుగుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు అమలాపురం డీఎస్పీ షేక్ బాషా తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం తొక్కిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన... గుర్రం కృష్ణ చాలా ఏళ్లుగా దొంగతనాలు చేస్తున్నాడు. గోపాలపురం, కొయ్యలగూడెం, నల్లజర్ల, జంగారెడ్డిగూడెం, గణపవరం, తాళ్ళరేవు, దేవరపల్లి గ్రామాల్లో టీవీఎస్ ఎక్స్ఎల్ మోటార్ సైకిళ్ళు దొంగతనాలు చేశాడని డీఎస్పీ వివరించారు.

ఆయా పోలీస్​స్టేషన్లలో ఇతనిపై 80 కేసులు వరకు నమోదయ్యాయని చెప్పారు. పలు కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించాడన్నారు. రావులపాలెం పరిధిలో 13, పశ్చిమగోదావరి జిల్లాలోని ఇరగవరం, నిడమర్రు పరిధిలో 3 మోటార్ సైకిళ్ళు దొంగతనం చేశాడని డీఎస్పీ వివరించారు. రావులపాడు గ్రామం వద్ద తనిఖీలు చేస్తుండగా... ఇతన్ని పట్టుకున్నామని చెప్పారు. అరెస్టు చేసి అతని నుంచి 16 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఇవీ చదవండి...నలుగురు దోపిడీ దొంగల అరెస్టు

Intro:AP_RJY_56_13_BIKE NIDUTHUDU_ARESST_AVB_AP10018

తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డి.ఎస్.పి షేక్ బాషా అన్నారు.

Body:రావులపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం తొక్కి రెడ్డిగూడెం గ్రామానికి చెందిన గుర్రం కృష్ణ 1993 సంవత్సరం నుండి బైక్ దొంగతనాలు చేస్తున్నాడన్నారు. గతంలో పశ్చిమగోదావరి జిల్లాలోని గోపాలపురం, కొయ్యలగూడెం, నల్లజర్ల, జంగారెడ్డిగూడెం, గణపవరం, తాళ్ళరేవు, దేవరపల్లి గ్రామాల్లో టీవీఎస్ ఎక్స్ఎల్ మోటార్ సైకిళ్ళు దొంగతనాలు చేసి ఆయా పోలీస్ స్టేషన్లో ఇతనిపై 80 కేసులు నమోదయ్యాయని జైలు శిక్ష కూడా అనుభవించారు.

Conclusion:ప్రస్తుతం రావులపాలెం పరిధిలోని 13 మోటార్ సైకిళ్ళు, పశ్చిమగోదావరి జిల్లాలోని ఇరగవరం నిడమర్రు పరిధిలో మూడు మోటార్ సైకిళ్ళు దొంగతనం చేశాడన్నారు.
రావులపాడు గ్రామం వద్ద తనిఖీలు చేస్తుండగా గుర్రం కృష్ణను అరెస్టు చేసి అతని వద్ద నుండి 16 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇతనిపై కేసు నమోదుచేసి కొత్తపేట కోర్టుకు హాజరు పరిచినున్నట్లు డిఎస్పీ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.