NURSERIES: తూర్పుగోదావరి జిల్లాలోని కడియం నర్సరీల్లో చూపరుల్ని పూలమొక్కలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఏటా నవంబర్ నుంచి సీజనల్ పువ్వులు వికసిస్తాయి. దేశీయ రకాలైన బంతులు, చామంతులతోపాటు.. విదేశాలకు చెందిన డాలియా, సాల్వియా, పిటోనియా డామాంతస్, వర్సీనా, గజేనియా, ప్లాక్స్, ఆస్ట్రో, పెంటాస్, జినియా, ఇండోర్ ఫ్లనాగ్, ఇంపీషన్స్ మొక్కలు దర్శనమిస్తున్నాయి. ఈ ఏడాది సందర్శకుల్నిఈ పుష్పాల అందాలు ఇట్టే ఆకట్టుకుంటున్నాయి.
దూరప్రాంతాల సందర్శకులు సీజనల్ మొక్కల్ని చూసి మైమరచిపోతున్నారు. గతేడాది ఎడతెరిపిలేని వర్షాలతో లెక్కలేనన్ని మొక్కల్ని కోల్పోయామని.. గతనెల నుంచి సీజనల్ మొక్కల్ని పెంచుతున్నామని చెబుతున్నారు నర్సరీల యజమానులు.
ఇదీ చదవండి: