ETV Bharat / state

శ్రీశైలం ప్రభావంతో.. అన్నవరం దేవస్థానం సిబ్బందిలో మార్పులు - ananvram temple taja news

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో టికెట్ కౌంటర్ల వద్ద అవుట్ సోర్సింగ్ సిబ్బంది స్థానంలో రెగ్యులర్ ఉద్యోగులను నియమిస్తూ ఈవో త్రినాథరావు ఆదేశాలిచ్చారు. శ్రీశైలం దేవస్థానంలో జరిగిన భారీ కుంభకోణంతో దేవాదాయశాఖ ఇకపై ఇలాంటి తప్పులు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో తెలిపారు.

due to effect on srisailam temple anavarm temple corntact employees changed

author img

By

Published : Jun 30, 2020, 10:05 PM IST

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో టికెట్ కౌంటర్ల వద్ద బ్యాంకు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది స్థానంలో... దేవస్థానం రెగ్యులర్ ఉద్యోగులను విధులకు నియమిస్తూ ఈవో త్రినాథరావు ఆదేశాలు జారీ చేశారు. టిక్కెట్ కౌంటర్ల వద్ద ఆర్థిక లావాదేవీలకు కేవలం రెగ్యులర్ సిబ్బందిని మాత్రమే నియమించాలని బ్యాంకు, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించవద్దని దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో భాగంగా 19 మంది సిబ్బందిని అంతర్గత బదిలీ చేసి వీరిని ఆయా కౌంటర్ల వద్ద నియమించారు. శ్రీశైలం దేవస్థానంలో దర్శన, ఆర్థిక సేవల ఆన్​లైన్ టికెట్ల వ్యవహారంలో భారీ కుంభకోణం ఇటీవల వెలుగు చూసింది. ఇటువంటి పరిస్థితులకు అవకాశం లేకుండా దేవస్థానంలో రోజువారీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎక్కడా తేడా లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో.. అన్నవరంలో కొండపైన, దిగువన ప్రసాదం, వ్రతం, ఇతర ఆర్జిత సేవల టిక్కెట్ల కౌంటర్ల వద్ద బ్యాంకు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి:

ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనున్న ఇద్దరు మంత్రులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.