కరోనా వ్యాప్తి నియంత్రణకు ఉద్దేశించి.. మాస్కుల పంపిణీ కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లాలో వేగంగా కొనసాగుతోంది. మాస్కులను కుట్టే పనిని డ్వాక్రా మహిళలకు అప్పగించారు. జిల్లాలోని 55 లక్షల మంది ప్రజలకు కోటి 70 లక్షల మాస్కులు కావాల్సి ఉండగా.... ఇప్పటి వరకు 25 లక్షలు పంపిణీ చేసినట్లు.... గ్రామీణాభివృద్ధి పీడీ చెప్పారు. త్వరలోనే మిగిలిన వారికి మాస్కులను పంపిణీ చేస్తామని తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేని తమకు మాస్కులు కుట్టడం వలన.... రోజుకు 500 నుంచి 600 వరకు ఆదాయం వస్తోందని డ్వాక్రా మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: