తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రామారావుపేటలో ఓ వైన్ షాపు వద్ద క్యూలైన్లలో నిల్చున్న మందుబాబుల్ని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రేమే దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఉంది. మద్యంప్రియులు తెల్లవారుజాము నుంచే దుకాణాల వద్ద బారులు తీరారు. కొవిడ్ నిబంధనల్ని ఏమాత్రం పట్టించుకోవటం లేదు. వందల సంఖ్యలో రోజూ కేసులు పెరిగిపోతుంటే మందుబాబులు మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చూడండి