తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్ళరేవు, ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన మండలాల్లోని తీర గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మండల కేంద్రాలలోనూ ప్రజలు తాగునీటి కొరకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాయి. కానీ ఇంతవరకూ అమలుకు నోచుకోలేదు. కనీసం జనాభా ప్రాతిపదికన అయినా కుళాయిలు ఏర్పాటు చేయాలని.. ప్రతి కుటుంబానికీ సరిపడేంత నీటినీ సరఫరా చేయాలనీ అధికారులను ప్రజలు వేడుకొంటున్నారు. ఎన్నికల సమయంలో... అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో పనైపోతుందని నేతలు చెప్పినా... ఏడాది దాటినా ఏ మార్పులేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి... తమ తాగునీటి సమస్యలు తీర్చాలని కోరుతున్నారు.
ఇదీ చదవండీ... రైతులకు విద్యుత్ బిల్లుల సమస్య ఉండదు: సీఎం జగన్