రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామ సచివాలయంలో పాడి రైతులకు సమావేశం నిర్వహించారు. రైతులకు ప్రభుత్వం వారు అందించే పశువుల దానాలు, పశు నష్ట పరిహారం, ఉచిత ఇన్సూరెన్స్, లోన్ సౌకర్యం, కిసాన్ క్రెడిట్ కార్డు మొదలైనవి తెలియజేశారు. రైతులు రోడ్లపై ఆవులను వదిలి వెళ్తున్నారని... దాని వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఇకపై ఆవులను రోడ్లపై వదిలితే రైతులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు, పంచాయతీ అధికారులు హెచ్చరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సత్తిరాజు, గ్రామ పశు సంవర్ధక శాఖ గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి