తూర్పుగోదావరి జిల్లాలో నిత్యావసర సరకుల పంపిణీ
రంజాన్ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా తుని లో పాత గొనె సంచుల వర్తక సంఘం ఆధ్వర్యంలో ముస్లింలకు నిత్యావసర సరకులను పంపిణి చేశారు.
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామాల్లో సేవలందిస్తున్న గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే ఎస్. సూర్యనారాయణ రెడ్డి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. 30 మంది పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ సూట్లను అందించారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ గ్రామస్తులకు సరకులు పంచారు.
నెల్లూరు జిల్లాలో..
నెల్లూరులో మానసిక వికలాంగులకు గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ పౌష్టికాహారం అందజేసింది. నగరంలో ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ లో ఉంటున్న దాదాపు 200 మంది మానసిక వికలాంగులకు కోడిగుడ్లు, అరటి పండ్లు, వేరుశనగ ముద్దులు, బిస్కెట్ ప్యాకెట్ లను ట్రస్టు నిర్వాహకుడు గంగాధర్ పంపిణీ చేశారు.
నాయుడుపేట పిళ్లారగుడి వీధిలో రంజాన్ పండుగ సందర్భంగా 100 పేద ముస్లింలు కుటుంబాలకు మౌనిక మదర్ వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులు ఐదు కేజీల బియ్యం చొప్పున అందించారు.
ప్రకాశం జిల్లాలో...
ప్రకాశం జిల్లా కనిగిరిలో లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు కేర్ ఇండియా సంస్థ 125 కుటుంబాలకు నిత్యావసర సరకులను పంపిణీ చేసింది.
పశ్చిమగోదావరి జిల్లాలో...
పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరు మండలం సింగవరం కూడలిలో దాతలు వేగ్నేశ శ్రీనివాసరాజు, వేగ్నేశ సూర్యనారాయణ.. 1000 మంది వలస కూలీలకు భోజనాలు, పండ్లు పంపిణీ చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జాతీయ రహదారిపై బస్సులు, లారీలలో రాకపోకలు సాగించే వలస కూలీలు, వాహన చోదకులకు వీటిని అందించారు.
దెందులూరు లోని 16 నెంబర్ జాతీయ రహదారి పై రాకపోకలు సాగిస్తున్న వలస కూలీలు, వహన చోదకులకు వేమగిరి సర్వారాయ షుగర్స్ వారు ఉచితంగా శీతల పానీయాలు అందజేస్తున్నారు. రోజుకు సుమారు 2500 మందికి వీటిని అందజేస్తున్నట్లు భీమడోలు ఏరియా మేనేజర్ మురళీ తెలిపారు.
గుంటూరు జిల్లాలో...
గుంటూరు జిల్లా నుంచి వలస కార్మికుల తరలింపు ప్రక్రియ త్వరలోనే పూర్తవుతోందని ఐజీ ప్రభాకర్ రావు చెప్పారు. అమ్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కాజా టోల్ గేట్ వద్ద వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఐజీ పాల్గొన్నారు. వలస కార్మికులకు ఐజీ భోజనం వడ్డించారు.
కడప జిల్లాలో...
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలోని 30 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.
విశాఖ జిల్లాలో..
విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని బైలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలకు చెందిన 9 మంది ఉపాధ్యాయులు.. పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: