ETV Bharat / state

గోదావరి జిల్లాల్లో క్రైం తగ్గింది.. 15రోజుల్లో 45మందిని అరెస్టు చేశాం: డీజీపీ - Crime news

‍‌Ganja supplies in state: గంజాయి సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్​రెడ్డి తెలిపారు. రాజమహేంద్రవరంలో పోలీస్ కన్వెన్షన్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. 15రోజుల్లో రాజమండ్రిలోనే 45మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.

‍‌Ganja supplies in state
‍‌Ganja supplies in state
author img

By

Published : Mar 2, 2023, 1:58 PM IST

Ganja supplies in state:ఏడాది వ్యవధిలో 77 వేల కేసులు తగ్గించామని, రాష్ట్రంలో పోలీసు శాఖపై ప్రజలకు విశ్వసనీయత పెరిగిందని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన రాజమహేంద్రవరంలో పోలీస్ కన్వెన్షన్ సెంటర్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, మహిళా పోలీసులతో చిన్న చిన్న గొడవలు పరిష్కారం అవుతున్నాయని అన్నారు. అలాగే ఈ మధ్య కాలంలో పోలీసులపై అనేక రకాలు అనేక మంది ఆరోపణలు చేస్తున్నారు. అధికార పార్టీకి అండగా ఉంటున్నామని.. వారికోసమే పని చేస్తున్నట్టు ఆరోపణలు చేస్తున్నారు. శాంతి భద్రతలను పరిరక్షించడమే పోలీసుల పని, ప్రతిపక్షాల గొంతుకు మేమెందుకు నొక్కుతామని డీజీపీ ప్రశ్నించారు. నిర్దేశించిన ప్రదేశాల్లో సభలు పెట్టుకోవాలని సూచించాం. అంతే కాని ఇరుకైన ప్రదేశాల్లో సభలు పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగేలా వారి ప్రాణాలకు ముప్పు కలిగేలా ఉంటే అంగీకరించమని ఆయన స్పష్టం చేశారు. అనపర్తి కేసులపై దర్యాప్తు వివరాలు వెల్లడిస్తామన్నారు.

గొదావరి జిల్లాల్లో క్రైం తగ్గింది.. 15రోజుల్లో 45మందిని అరెస్టు చేశాం: డీజీపీ

గంజాయి సాగుని పూర్తిగా నాశనం చేశాం.. గంజాయి కేసుల్లో అరెస్టు అయిన వాళ్లు ఎవరికి సప్లై చేస్తున్నారని.. విచారిస్తున్నాం.. ప్రతి పోలీస్టేషన్లో విచారించి అదే కేసుల్లో వాళ్లను కూడా అరేస్టు చేస్తున్నాం.. తరచుగా దొరికే వారిపై పీడీ యాక్ట్​ నమోదు చేస్తాం. కాలేజీల్లో ప్రిన్సిపల్స్​ కాని, టీచర్స్​ కాని, పేరెంట్స్​ కాని తమ పిల్లల్లో ఎవరైనా గంజాయికి బానిస అవుతున్నారు అంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. వారికి ఎవరు సప్లై చేస్తున్నారో గమనించి అందరిపైనా చర్యలు తీసుకుంటాం. గత 15రోజుల్లో 45మందిని రాజమహేంద్రవరంలో అరెస్టు చేశాం.- రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ

గంజాయి అమ్మకాలపై నిఘా: ఈ మధ్యన రాష్ట్రంలో గంజాయి ఎక్కడపడితే అక్కడ పట్టుబడుతూనే ఉంది. గతంలో పట్టణాలు, నగరాల్లో లభించే గంజాయి.. తాజాగా మారుమూల గ్రామాలకూ పాకింది. గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు మూడు పువ్వులు ఆరు కాయలు అన్న విధంగా యథేచ్ఛంగా జరుగుతుంది. పోలీసుల దాడుల్లో వందల కిలోలు పట్టుబడుతుంటే వారి కన్నుగప్పి వేలాది కిలోల గాంజా అమ్మకాలు జోరందుకుంటున్నాయి. మహిళలలు కూడా గంజాయి అమ్మకాల్లో పాల్గంటున్న విషయం ఆందోళన కలిగిస్తోంది. ఇక పోతే పోలీసు యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం మోపింది.

జాతీయ రహదారులు, ప్రధాన రహదారులు అనే తేడా లేకుండా అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తూ.. గంజాయి, మత్తు పదార్థాలను అక్రమంగా రవాణాలు, అమ్మకాలను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు నిఘా ఏర్పాటు చేసి ఆకస్మిక దాడులు చేస్తున్నారు. గంజాయి మత్తులో పడి యువత తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు అని ఎలాగైనా యువతను దీనికి బానిసలుగా అవ్వకూడదని ప్రత్యకంగా కళాశాలల్లో గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టామని డీజీపీ పేర్కొన్నారు.

గంజాయి మత్తులో దాడులు: రాష్ట్రంలో ఇటీవల గంజాయి మత్తులో దాడులు పెరిగిపోయాయి. కళాశాలకు వెళ్లే యువతులు.. పాఠశాలకు వెళ్లే విద్యార్థినులు.. కార్యాలయాలకు వెళ్లే మహిళలు ఒంటరిగా వెళ్లేందుకు జంకుతున్నారు. గంజాయికి అలవాటు పడున యువకులు.. మత్తులో విచక్షణ కోల్పోయి దాడులకు తెగబడుతున్నారు. ఇటీవల దాడుల సంస్కృతి బాగా పెరిగిపోయింది.. గంజాయి అమ్మకాలపై చర్యలు తీసుకోవాసని ప్రతిపక్షాలు గగ్గోలపెడుతున్నా.. ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. సులభంగా డబ్బు సంపాదించాలని.. రాష్ట్రంలో ఇటీవల గంజాయి అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.