గోదావరి లంకల్లో వరదల వల్ల జంతువులు జనావాసాల్లో వస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో రెండు జింకలు హల్ చల్ చేశాయి. మండలంలోని నారాయణలంకలో జింకలు ఆవాసం పొందుతూ ఉంటాయి.
గత వారం రోజులుగా భారీ వర్షాలు, వరదపోటు లంకల్లోకి నీరు చేరింది. దీంతో జింకలు సమీప గ్రామాల్లోకి రావడంపై.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు స్పందించారు. స్థానిక యువకుల సహాయంతో వాటిని పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు.
ఇదీ చదవండి: