తూర్పుగోదావరి జిల్లాలో కొవిడ్ మరణాల సంఖ్య పెరిగిపోతోంది. జీజీహెచ్‌తో పాటు వివిధ ఆస్పత్రులు, ఇళ్లలో చనిపోయిన వారి మృతదేహాలు శ్మశానవాటికలకు తరలిస్తూనే ఉన్నారు. కాకినాడలో విజ్జపురెడ్డి వారి హిందూ శ్మశానవాటికలో నిత్యం అంత్యక్రియలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయినా.. మృతదేహాలతో అంబులెన్స్‌లు వేచి ఉంటున్నాయి. కొవిడ్ సృష్టిస్తున్న విలయానికి చితి మంటలు నిరంతరం రగులుతూనే ఉన్నాయి.
ఇదీ చదవండి: మద్యం అమ్మకాలకు క్యూ.. వ్యాక్సిన్ల కేంద్రాల వద్ద తోపులాటా?: లోకేశ్