తూర్పుగోదావరి జిల్లా తునిలో నిబంధనలు అతిక్రమించి, పరిమితికి మించి ప్రయాణిస్తున్న వాహనాలు తనిఖీ చేశారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో ఉన్న వారిని చూసి రవాణా శాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. ఆ వాహనంలో పరిమితికి మించి విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులను తరలిస్తున్న టాటా ఏస్ వాహనంలో మొత్తం 25 మంది ఉన్నారు. ముందు డ్రైవర్ సీట్ పక్కనే ఏకంగా నలుగురు కిక్కిరిసి కూర్చున్నారు. ఇంత మందిని ఎలా ఎక్కించావని.. డ్రైవర్ పై అగ్రహం వ్యక్తం చేసిన అధికారులు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇలా పరిమితికి మించి ప్రయాణం చేస్తే ప్రమాదమని తెలియజేసారు. .ఎప్పుడూ..ఏమౌవుతుందో తెలియని పరిణామాలలో ఇలాంటి ప్రయాణాలతో ప్రమాదాలు కొనితెచ్చుకోవడమే అవుతుందని...వీటిపై తల్లితండ్రులకు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
ఇదీచూడండి.ఉపాధ్యాయుడి కిడ్నాప్...చేసిందెవరు ?