తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కంటైన్మెంట్, రెడ్ జోన్ పరిధిలోని వారికి ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. సుమారు 25వేల కుంటుంబాలకు 18రకాల సరకులు అందించారు. చెరుకూరి కళ్యాణ మండపం వద్ద ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సరకులు ఉన్న వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. తితిదే ఛైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఎంపీని అభినందించారు.
ఇవీ చదవండి.. ఆ మత్స్యకారులకు రూ.2 వేలు ఆర్థిక సాయం: సీఎం