తూర్పు గోదావరి జిల్లా దేవీపురం నుంచి కోనసీమ వరకు ఉన్న వేలాది ఎకరాల్లో పంటలు వరద నీటిలో మునిగిపోవటంతో రైతులు విలవిల్లాడుతున్నారు. ఆరుగాలం కష్టపడి చేతికొస్తుందనుకున్న పంట వరదపాలు కావటంతో రైతన్నలు బోరుమని విలపిస్తున్నారు. వంగ, బెండ, బీర, మునగ, అరటి తోటలు వరద నీటికి పూర్తిగా దెబ్బతిన్నాయి. మేత దొరక్క పశువులు పడుతున్న అవస్థలను చూడలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదారమ్మ సుడులు తిరిగి ప్రవహిస్తుంటే, రైతు కుటుంబాల కంట్లో కన్నీటి సుడులు తిరుగుతున్నాయి. నష్టపోయిన పంటలకు తగిన పరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని రైతులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం తమ కన్నీటిని చూసి తగిన భరోసా కల్పించే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి : గోదారి శోకం... లంక రైతుల గుండె"కోత"