పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఏలూరు నగరంలోని రాజా లాడ్జ్‌పై పోలీసులు దాడి చేశారు. దాడిలో ఐదుగురు బుకీలు, ఇద్దరు ప్లంటర్స్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుల నుంచి సెల్ఫోన్లు, 20 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
పేమెంట్స్ ఆన్లైన్లో..
క్రికెట్ బెట్టింగ్‌ను అధికంగా ఆన్లైన్ పేమెంట్ రూపంలో నగదు బదిలీ జరుగుతోందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మరో 27 మందిని పోలీసులు గుర్తించారు. జిల్లావ్యాప్తంగా ఈ బుకీలు క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు దర్యాప్తు వెల్లడైందని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : శ్రీసిటీ.. ఇచ్చట అంతర్జాతీయ స్థాయి దుస్తులు తయారవును..!