ETV Bharat / state

Polavaram Nirvasitula Problems: "పోలవరం నిర్వాసితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు" - cpm state president

CPM Leader Srinivasa Rao on Polavaram Nirvasitula Problems: పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని.. ముఖ్యంగా ముంపు ప్రాంతాల్లోని నిర్వాసితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మండిపడ్డారు. గోదావరి వరద విపత్తు నిర్వాహణకు ముందస్తు సహాయక చర్యలు తీసుకోకపోతే వైఎస్సార్​సీపీ నాయకులను ప్రజలు గ్రామాల్లోకి రానివ్వరని హెచ్చరించారు.

Polavaram Nirvasitula Problems
Polavaram Nirvasitula Problems
author img

By

Published : Jul 21, 2023, 1:32 PM IST

CPM Leader Srinivasa Rao on Polavaram Nirvasitula Problems: పోలవరం ప్రాజెక్టులో సర్వస్వం కోల్పోతున్న నిర్వాసితులకు పునారావసం కల్పించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తప్పించకుంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని.. ముఖ్యంగా పోలవరం ముంపు ప్రాంతాల్లోని నిర్వాసితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదనిమండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులు అవుతున్న గిరిజనులకు కల్పించాల్సిన పునరావసం విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంటుందన్నారు.

నిర్వాసితులకు అండగా నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వారిని ఏమాత్రం పట్టించుకోకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. గోదావరి వరద విపత్తు నిర్వాహణకు ముందస్తు సహాయక చర్యలు తీసుకోకపోతే వైఎస్సార్​సీపీ నాయకులను ప్రజలు గ్రామాల్లోకి రానివ్వరని హెచ్చరించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకొచ్చి నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. గత ఏడాది గోదావరికి వచ్చిన వరదలు.. పునరావస ప్రాంతాల్లో నిర్వాసితులకు నేటికీ ఒక పీడకలగా మిగిలిపోయిందన్నారు. ఈ తరుణంలో ప్రస్తుతం గోదావరికి వస్తున్న వరద సాధారణమైనది కాదని, పోలవరం ప్రాజెక్టు వల్ల మాత్రమే వరదలు వస్తున్నాయని అన్నారు. గోదావరికి వచ్చే సాధారణ వరదలతో సహజీవనం చేసే అలవాటు గోదావరి తీరంలో ప్రజలకు ఉందని, అయితే ప్రస్తుతం వస్తున్న వరదలు కేవలం పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్ల మాత్రమేనని అన్నారు. ప్రస్తుత వరద వల్లే ముంపు మండలాల్లో అనేక గ్రామాలు ముంపు బారిన పడ్డాయని, గ్రామాల మధ్య సంబంధాలు కూడా లేకుండా పోతున్నాయని తెలిపారు. కావున ప్రత్యామ్నాయ రహదారులను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

గోదావరికి ఎగువ ప్రాంతంలో బ్రిటీష్‌ వారి కాలంలో వారి అవసరాల కోసం వేసిన రోడ్లు కూడా పాడయ్యాయని, ఆ రోడ్లకు మరమ్మత్తులు చేపట్టడం ద్వారా నిర్వాసితులకు వరదల సమయంలో సహాయం చేయడానికి దోహదం చేస్తాయని తెలిపారు. ఎటపాక ఎగువ భాగంలో పునరావస కాలనీలు ముంపునకు గురయ్యాయని, కావున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యామ్నాయ రహదారులను పటిష్టం చేయాలన్నారు. అలాగే ముంపు బాధితులకు అవసరమైన తార్బాల్స్‌, నిత్యవసర సరుకులు, కిరోసిన్‌, కొవ్వొత్తులు, ప్రాథమిక వైద్యానికి అవసరమైన మందులు, ప్రత్యేక అధికారుల నియామకం వంటి సహాయక చర్యలను తక్షణమే చేపట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పోలవరం నిర్వాసితుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ ఏడాది ఆగస్టు 7వ తేదీన పార్లమెంటు సమావేశాలను పురష్కరించుకుని ధర్నా చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని తెలిపారు. ఆగస్టు ఏడో తేదీన దిల్లీలో జరిగే ధర్నాలో రాజకీయాలకు అతీతంగా పార్టీలు, గిరిజన, ప్రజా సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.