ETV Bharat / state

యానాంలో వెయ్యికి పైగా కరోనా కేసులు

author img

By

Published : May 8, 2021, 4:48 PM IST

తూర్పుగోదావరి జిల్లా సమీపంలోని కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో కొవిడ్​ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. వైరస్​ నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సహకరించాలని పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ప్రజలను కోరారు.

empty streets in yanam
నిర్మానుష్యంగా మారిన యానాం వీధులు

తూర్పు గోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంలో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్​ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. వైరస్​ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్​ జోన్లుగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి రోజు 500 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండగా.. 120 నుండి 150 మంది మహమ్మారి బారిన పడుతున్నారు. యానాం ప్రభుత్వ ఆసుపత్రిలో 284 మంది.. హోం ఐసోలేషన్​లో 779 మంది చికిత్స పొందుతున్నారని పుదుచ్చేరి ఆరోగ్య శాఖ తెలిపింది. 56 మంది వైరస్​ కారణంగా మరణించినట్లు పేర్కొంది.

బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలను కొవిడ్​ కేర్ సెంటర్​గా మార్చి 50 పడకలు ఏర్పాటు చేశారు. 24 గంటలు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న నివారణ చర్యలకు ప్రజలంతా సహకరించాలని ఆరోగ్యశాఖ మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ప్రజలను కోరారు. ఎవరూ అధైర్య పడవద్దని.. నూతన ముఖ్యమంత్రి రంగస్వామి ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించి అందరికీ టీకాలు అందించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

కరోనాతో యడ్లపాడు ఎంఈఓ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.