తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలో బోడసకుర్రు గ్రామంలో 2 వేల పడకలతో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ను కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రారంభించారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సెంటర్ నిర్వహణలో ఎవరైనా అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్డీవో వసంతరాయుడు, అదనపు డీఎమ్హెచ్వో డాక్టర్ పుష్కరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :
'కొవిడ్ కేర్ ఆసుపత్రుల ఏర్పాటుకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నాం'