కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని బోడసకుర్రులో 1400 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. బొడసకుర్రలోని ప్రభుత్వానికి చెందిన ఏపీ టీడ్కో భవనాన్ని కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు వినియోగిస్తామని అధికారులు తెలిపారు.
అమలాపురం ఆర్డీఓ భవానీ శంకర్, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ చైతన్య భవనాన్ని పరిశీలించారు. ఈ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన వసతులు త్వరలో అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: 'మంత్రి బొత్స సోదరుడు మా భూమిని ఆక్రమిస్తున్నాడు'