'పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి' అంటారు ఉభయ గోదావరి జిల్లావాసులు. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం పులస చేప ప్రత్యేకత. ఈ మీనంతో చేసిన వంటకం బహు రుచిగా ఉంటుందంటారు మాంసాహార ప్రియులు. అందుకే కాస్త ఖరీదైనా ఏమాత్రం వెనకాడకుండా కొనుగోలు చేస్తారు. తాజాగా కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం గౌతమి గోదావరి తీరంలో మత్స్యకారుల వలకు చిక్కిన ఒక పులస వేలం వేయగా రూ.25 వేలు రికార్డు ధర పలికింది. మరో వెయ్యి అదనంగా చెల్లించి ఓ మాంసాహార ప్రియుడు కొనుగోలు చేసి ఇంట్లో కూర వండించాడు.
![Pulsa fish](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-rjy-36-03-yanam-fishcurrey-25thousand-above-av-ap10019_03092021114610_0309f_1630649770_317.jpg)
విదేశాల నుంచి వచ్చిన తన కుటుంబ సభ్యులకు ఎంతో రుచికరమైన ఈ పులస చేప పులుసు రుచి చూపించాలని.. ఖరీదైనా కొనుగోలు చేసినట్లు అతడు చెప్పాడు. బెండకాయలు, మరికొన్ని మసాల దినుసులతో కలిపి చేసే ఈ కూరను 24 గంటల తరువాత తింటేనే అద్భుతంగా ఉంటుందని తెలిపాడు.
ఇదీ చదవండీ.. AP RAINS LIVE UPDATES : రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు.. రోడ్లన్నీజలమయం