తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మండలంలో ఆయనతో గత పది రోజుల నుంచి మాట్లాడుతున్న ఉపాధ్యాయులు కలవరపడుతున్నారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి పీఏకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ ప్రధానోపాధ్యాయుడు ఆయనకు బంధువు. ఆయన నుంచి ఈయనకు వైరస్ సోకిందని అధికారులు తెలిపారు. ఈ మండలంలో ప్రధానోపాధ్యాయుడితో మాట్లాడిన ఏడుగురు ఉపాధ్యాయులను హోమ్ క్వారంటైన్లో ఉండాలని సూచించామని వైద్యాధికారి సుబ్బరాజు తెలిపారు.
ఇదీ చూడండి. మచిలీపట్నం కోర్టుకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర