తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలోని ముంగండ గ్రామానికి చెందిన ఒక మహిళ.. యాత్ర బస్సులో కాశీకి వెళ్లి ఈ నెల 19న వచ్చారు. ఆమెతో పాటు బస్సులో ఉన్న మిగిలిన వారికి ఈనెల 19న పలివెలలో కరోనా పరీక్షలు చేశారని పీహెచ్సీ వైద్యాధికారి కె.సుబ్బరాజు తెలిపారు. ముంగండ గ్రామానికి చెందిన ఆ మహిళకు కరోనా పాజిటివ్ గా ఫలితం వచ్చేసరికి.. స్థానికంగా ఆందోళన మొదలైంది.
కాశీకి వెళ్లి వచ్చిన సందర్భంగా.. గ్రామంలో ఇరుగుపొరుగు వారిని పిలిచి భోజనాలు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది ఆమె కాళ్లు కడిగి నీళ్లు నెత్తి మీద చల్లుకున్నారు. దీంతో ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించి.. కరోనా నివారణ చర్యలు చేపట్టామని ముంగండ పంచాయతీ కార్యదర్శి డి.సత్యనారాయణ తెలిపారు. గ్రామంలో ఆమెతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న 20 మంది పైబడి ఉన్నట్టు గుర్తించామని... వారందరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు చేస్తామని పీహెచ్సీ వైద్యాధికారి సుబ్బరాజు తెలిపారు.
ఇవీ చూడండి: