తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు బాలికల బీసీ సంక్షేమ వసతిగృహాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ముగ్గురు విద్యార్థినులకు.. ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 14 రోజుల పాటు వసతి గృహం మూసేశారు. ఈ గృహంలో 59 మంది బాలికలు ఉంటున్నారు.
వీరితో కాంటాక్ట్ అయిన వ్యక్తులకు పరీక్షలు నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సర్వే నిర్వహిస్తోంది. సంబంధిత పాఠశాల విద్యార్థులకు కరోనా పరీక్షలు చేపట్టారు. పక్కనే ఉన్న బాలుర వసతి గృహంలో 83 మంది విద్యార్థులు సైతం భయంతో ఇళ్లకు వెళ్లారు. 85 మందికి ఇద్దరే వసతి గృహంలో ఉన్నారని అక్కడి సిబ్బంది తెలిపారు.
ఇవీ చూడండి: