తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. జిల్లాకు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలోనే వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. అధికారులు అప్రమత్తమై సంబంధిత గ్రామాలను రెడ్జోన్లుగా ప్రకటిస్తూ ఆంక్షలను విధిస్తున్నారు. జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్లరేవు, ఐ పోలవరం, ముమ్మడివరం, కాట్రేనికోన, నాలుగు మండలాల్లో అమెరికా, తెలంగాణ, కర్ణాటక , మహారాష్ట్ర నుంచి స్వగ్రామం వచ్చిన వారిని క్వారంటైన్ లో ఉంచి పరీక్షలు నిర్వహించగా కరోనా లక్షణాలు బయట పడ్డాయి.
వీరి ద్వారా కుటుంబ సభ్యులకే కాక ఇతరులకు వైరస్ సోకింది. అప్రమత్తమైన అధికారులు ఆ గ్రామాలను రెడ్ జోన్లు గా ప్రకటించి పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. ఇలా ప్రతి మండలంలోనూ ఐదు నుంచి పది గ్రామాలు కంటైన్మెంట్ చేయటంతో రోజువారి జీవనం సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అనుమానితుల నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించిన వారం రోజుల వరకు ఫలితాలు వెలువడక పోవడంతో బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోంది.
ఇదీ చూడండి