ETV Bharat / state

ఫీవర్‌ సర్వేలో బయటపడుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు - fever survey in east godavari district news

కొవిడ్‌ విజృంభణ వేళ.. కొందరు రోగ లక్షణాలను గోప్యంగా ఉంచుతున్నారు. మరికొందరు ప్రైవేటుగా పరీక్షలు చేసుకుని విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కర్ఫ్యూ ఆంక్షలు కొన్నిచోట్ల సత్ఫలితాలు ఇస్తున్నా.. ఆంక్షల సడలింపు సమయంలో రాకపోకలతో వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. కొందరు వ్యాధి లక్షణాలు గోప్యంగా ఉంచడం సమస్యగా మారింది.

details
వివరాలు సేకరిస్తున్న సిబ్బంది
author img

By

Published : May 24, 2021, 1:15 PM IST

తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ఇంటింటా ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఫీవర్‌ సర్వే మొదలైంది. ఇన్నాళ్లూ గుట్టుగా ఉన్న కొవిడ్‌ పీడితులు ఈ సర్వేలో ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. ఈ నెలాఖరు వరకు ఆరు విడతల సర్వే ద్వారా జిల్లావ్యాప్త పరిస్థితిపై అంచనాకు వచ్చి కొవిడ్‌ పీడితులందరినీ పూర్తిస్థాయిలో గుర్తించాలని అధికారులు నిర్ణయించారు.

దగ్గు.. జలుబు.. నొప్పులు..
బృందాల పరిశీలనలో జలుబు, దగ్గు, జ్వరం, కీళ్ల నొప్పులు ఇతరత్రా రుగ్మతలున్న వారిని గుర్తిస్తున్నారు. వీటిలో కొన్ని కాలానుగుణంగా సంక్రమించినవి కాగా.. మరికొన్ని కొవిడ్‌ లక్షణాలతో కూడినవని పరీక్షల్లో తేలుతోంది. పాజిటివ్‌ కేసుగా తేలితే..అవకాశం ఉన్నవారికి హోమ్‌ ఐసోలేషన్‌కు.. ఇంట్లో అవకాశం లేనివారికి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు.. అత్యవసర సేవలు అనివార్యమైతే ఆసుపత్రికి తరలించేలా వైద్యాధికారి ద్వారా చొరవ చూపుతున్నారు. అనుమానిత లక్షణాలున్నా ఎక్కువ మంది విషయం తెలిస్తే చుట్టుపక్కలవాళ్లు ఎలా చూస్తారో అన్న భయంతో బయటకు చెప్పకుండా సొంతంగా మందులు వాడేసే పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఇలాంటి కేసులను తాజా సర్వేలో గుర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వే కొన్నిచోట్ల సమర్థంగా సాగడంలేదన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఆరోగ్య అత్యయిక పరిస్థితి వేళ నిశిత పరిశీలనతోనే ముప్పును గుర్తించవచ్చనే వాదన వినిపిస్తోంది.

  • మామిడికుదురు మండలంలో నగరం, లూటుకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. 94.56 శాతం సర్వే పూర్తయింది. 23,499 నివాసాలకు.. 22,165 కుటుంబాల్లో సర్వే పూర్తయింది. దీనిలో అనుమానిత లక్షణాలున్న వారిని మండలం మొత్తం మీద 126 మందిని గుర్తించారు. వీరికి కొవిడ్‌ పరీక్షలు చేయాల్సి ఉంది.
  • గోకవరం మండలంలోని కొత్తపల్లి పీహెచ్‌సీ పరిధిలో నిర్వహించిన ఇంటింటి సర్వేలో 92 మంది జ్వరపీడితులను గుర్తించారు. వీరిలో 36 పాజిటివ్‌ కేసులు వెెలుగులోకి వచ్చాయి. జ్వరంతోపాటు.. తలనొప్పి, నీరసంతో ఎక్కువమంది బాధపడుతున్నట్లు తేలింది.
  • గొల్లప్రోలు మండలంలో సర్వేలో గుర్తించిన 806 మంది అనుమానితులకు పరీక్షలు చేస్తే.. 21 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. లక్షణాలున్నవారిలో ఎక్కువ మంది మధ్య వయసువారే ఉన్నారు.
  • పెద్దాపురం మండలంలోని కాండ్రకోట, పులిమేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 45ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువ జ్వర పీడితులను గుర్తించారు. జ్వరం తలనొప్పి, నడుమునొప్పి, విరేచనాలు లాంటి లక్షణాలు ఉన్నవారిని ఎక్కువగా గుర్తించారు.
  • బిక్కవోలు మండలంలో కొంకుదురు, బిక్కవోలు పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటి పరిధిలో 24,869 కుటుంబాలుంటే.. 24,270 ఇళ్ల సర్వే పూర్తయింది. అనుమానిత లక్షణాలున్న 142 మందిని గుర్తించారు. బిక్కవోలు పరిధిలోని 96 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు చేస్తే 28 పాజిటివ్‌ కేసులు, కొంకుదురు పరిధిలో 28 మందికి చేస్తే మూడు పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి.

రెండు వేల బృందాలతో..
జిల్లాలో 56 లక్షల కుటుంబాలున్నాయి. నగరం, పట్టణం, గ్రామీణం, మన్యంలో ఈనెల మొదటి వారం నుంచి ఫీవర్‌ సర్వే ప్రారంభమైంది. ప్రస్తుతం రెండు దశలు పూర్తయ్యాయి. మూడో విడత సర్వే కొన్నిచోట్ల మొదలైంది. నెలాఖరు వరకు ఈ సర్వే ద్వారా కుటుంబాల ఆరోగ్య పరిస్థితి నిశితంగా తెలుసుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆశ కార్యకర్త, గ్రామ/వార్డు వాలంటీరు ఈ ఇంటింటి సర్వేలో పాల్గొంటున్నారు. ఒక్కో బృందం రోజుకు 60 గృహాల్లో పరిస్థితిపై ఆరా తీయాలన్న లక్ష్యం నిర్దేశించారు. వీరంతా ఇంటింటి సర్వే ద్వారా అనుమానిత కేసులను గుర్తించి.. ఆయా లక్షణాల సమాచారం ఆరోగ్య కార్యకర్తలకు యాప్‌ ద్వారా చేరవేస్తారు. ఆరోగ్య కార్యకర్తలు అనుమానితుల పరిస్థితి ప్రత్యక్షంగా చూసి.. అవసరమైన వారికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించి వ్యాధి లక్షణాలపై ఓ నిర్ధారణకు వస్తారు. అవసరమైతే వైద్యాధికారి సూచనలతో మందులు, హోమ్‌ ఐసోలేషన్‌ కిట్లు అందజేస్తారు.

ప్రక్రియ పూర్తయితే స్పష్టత..

జిల్లాలో ఇంటింటి ఫీవర్‌ సర్వే చేస్తున్నాం. ఆశ కార్యకర్త, వాలంటీర్ల బృందానికి రోజుకు 60 ఇళ్లు చొప్పున లక్ష్యం నిర్దేశించాం. ఈ నెల 31లోగా ఫీవర్‌ సర్వే జిల్లాలో పూర్తవుతుంది. ఈ ఆరు విడతల సర్వే ప్రక్రియ పూర్తయితే ఇళ్లలో గోప్యంగా లక్షణాలతో ఉన్నవారు పూర్తిస్థాయిలో వెలుగులోకి వచ్చే వీలుంది. ఇంటింటి సర్వేలో జ్వరం ఇతర అనుమానిత లక్షణాలను గుర్తిస్తే ఏఎన్‌ఎం యాప్‌కు ఆ సమాచారం పంపుతారు. పీడిత కేసులున్న ఇళ్లకు ఆరోగ్య కార్యకర్తలు వెళ్లి పరిశీలించి వాస్తవ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటారు. అవసరమైన వారిని కొవిడ్‌ పరీక్షలకు పంపి.. నిర్ధారణ అయితే మందుల కిట్లు అందజేస్తారు. ఇతర అనారోగ్య లక్షణాలున్నవారికీ మందులు ఇస్తున్నారు. కొవిడ్‌ లక్షణాలు బయటకు ఉన్నా, ఆరోగ్య పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా.. వారిని హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచాలా..? అవకాశం లేనివారికి కొవిడ్‌ కేర్‌కు పంపాలా..? లేదంటే ఆసుపత్రికి తరలించాలా..? అని నిర్ణయం తీసుకుంటారు. - డాక్టర్‌ ప్రసన్నకుమార్, ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వో

ఇదీ చదవండి: విశాఖకు 18 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.