కోనసీమను కరోనా కలవరపెడుతోంది. ఇప్పటివరకు మెుత్తం 131 పాజిటివ్ కేసులు నమోదు కావటంతో, కోనసీమ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రావులపాలెం మండలం మినహా, మిగిలిన 15 మండలాల్లో పాజిటివ్ కేసులు నమోదైనట్లు డీఎమ్హెచ్వో డాక్టర్ పుష్కరరావు వెల్లడించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ... జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
కోటనందూరులో మెుదటి పాజిటివ్ కేసు నమోదు
తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. జగన్నాథపురం గ్రామంలో 39 ఏళ్ల మహిళకు వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌లో పనులు చేసుకునే వీరు, ఈనెల 15 గ్రామానికి రావటంతో భార్యాభర్తలకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్షల ఫలితాల్లో భార్యకు పాజిటివ్‌గా రాగా... భర్తకు నెగిటివ్‌గా తేలింది. దీంతో గ్రామాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు.
ఇదీ చదవండి: ఆడపిల్ల పుట్టిందని... బావిలో విసిరేశారు