ETV Bharat / state

యానాం ప్రజలను కలవరపెడుతున్న కరోనా

యానాం ప్రజలను కరోనా కలవరపెడుతోంది. రెండు వారాల క్రితం ఓ మహిళకు కరోనా సోకగా... తాజాగా మరో మహిళకు వైరస్ నిర్ధరణ అయింది. దీంతో అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేశారు.

యానం ప్రజలను కలవరపెడుతున్న కరోనా !
యానం ప్రజలను కలవరపెడుతున్న కరోనా !
author img

By

Published : Jun 28, 2020, 4:47 PM IST

యానాం ప్రజలను కరోనా కలవరపెడుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న ఈ ప్రాంతంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయపడుతున్నారు. మీప తాళ్లరేవు మండలంలోని రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్​లో పని చేసే మహిళకు 2 వారాల క్రితం కరోనా సోకింది. తోటి కార్మికులకు పరీక్షలు నిర్వహించారు. ఇతరులకు వైరస్​ వ్యాపించలేదని నిర్ధరణ అనంతరం సిబ్బందికి సెలవులు ప్రకటించారు.

ఆ సంస్థలో రోజువారి పనికి వెళ్లే యానాం కురసాంపేటకు చెందిన 60 ఏళ్ళ మహిళ అనారోగ్యానికి గురి కావడంతో యానాం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరింది. ఆమెకు కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించారు. ఆ మహిళతో ప్రైమరీ, సెకండరీ కాంటాక్స్ ఉన్న సుమారు 75 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించేందుకు వైద్య అధికారులు ఏర్పాట్లు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.