తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామంలో.. కరోనా సోకిన వ్యక్తి ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతుండటంతో పోలీసులు సహాయం చేశారు. కర్ఫ్యూ కారణంగా.. కానిస్టేబుళ్లు చిన్ని, శ్రీను లు రాత్రి విధులు నిర్వహిస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకి.. ఆక్సిజన్ అందక ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. ఇది గమనించిన పోలీసులు.. వెంటనే ఎస్సై నాగరాజుకు సమాచారం అందించారు. ఆయన లక్కవరం పీహెచ్సీ వైద్యాధికారులతో చర్చించి ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేసి అంబులెన్సులో అమలాపురం ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని సమయానికి రక్షించిన పోలీసులను పలువురు అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి: స్ట్రెచర్ లేక స్కూటీపైనే ఐసీయూకు కొవిడ్ రోగి