తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మున్సిపాలిటీ కార్యాలయం వద్ద గుత్తేదారులు (Contractor Protest in Amalapuram over Pending bills) నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని కోరుతూ కార్యాలయానికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ ఆవేదన వ్యక్తం చేశారు.
"మా బిల్లులు చెల్లించండి-మా ప్రాణాలు కాపాడండి, మేము ఉంటాము మీ వెంటే - మేము మిగిలి ఉంటే, నాడు పోషకులం- నేడు యాచకులం, ఆస్తులు కరిగాయి-అప్పులు పెరిగాయి" అనే నినాదాలతో కూడిన ఫ్లెక్సీలను మునిసిపల్ కార్యాలయంలో పలుచోట్ల ఏర్పాటు చేసి ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి
VUNDAVALLI ARUN KUMAR COMMENTS ON JAGAN: 'సీఎంగా జగన్ ఇంత ఘోరంగా విఫలమవుతాడని ఊహించలేదు'