తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో అధికారులు మూడు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. ఇటీవల గంగవరం తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. కార్యాలయంలో పనిచేసే 30 మంది ఉద్యోగులకు కొవిడ్ పరీక్షలు చేయగా పది మంది ఉద్యోగులకు వైరస్ సోకినట్లు అధికారులు ధ్రువీకరించారు.
వీరిలో ఐదుగురు ఉద్యోగులు రంపచోడవరంలో నివాసం ఉండటంతో వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. రంప చోడవరంలో ఐటీడీఏ క్వార్టర్స్, సాయి నగరం, ఐటీడీఏ ఎదురుగా ఉన్న ఎర్రంరెడ్డి నగరం వీధులను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.
ఇదీ చూడండి