ETV Bharat / state

Container Mobile House: 'కంటైనర్‌ మొబైల్‌ హౌస్‌'.. వసతులు అదుర్స్​ - తూర్పుగోదావరిలో విభిన్నంగా నిర్మించిన కంటైనర్ గృహం

Container Mobile House: ఆకట్టుకునే ఆకృతిలో, నివాసానికి అవసరమైనన్ని వసతులతో, ఎక్కడికైనా తరలించే సౌలభ్యంతో నిర్మించిన ఇంటిని ఎప్పుడైనా చూసారా? అయితే ఇప్పుడు చూడండి.. అదే 'కంటైనర్‌ మొబైల్‌ హౌస్‌'.. అలాగే వాటి ప్రత్యేకతలు తెలుసుకుందామా..!

Container Mobile House
విభిన్నంగా నిర్మించిన కంటైనర్ గృహం
author img

By

Published : Mar 30, 2022, 8:05 AM IST

Container Mobile House: తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం తమ్మయ్యపేటలోని పూజిత గార్డెన్‌ యజమాని జె.అప్పారావు.. కంటైనర్‌ మొబైల్‌ హౌస్‌ను తయారుచేయించుకొని తన తోటలో ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 360 చదరపు అడుగుల స్థలంతో ఉన్న ఈ ఇంటిని అన్ని సౌకర్యాలు ఉండేలా అందంగా తీర్చిదిద్దారు. ఇందులో ఒక హాలు, వంటగది, ఒక పడకగది, బాత్‌రూం ఉన్నాయి. నిర్దిష్ట ఎత్తులో పిల్లర్లు వేసి..వాటిపై దీన్ని అమర్చడంతో కింది భాగంలో కారు పార్కింగ్‌, ఇతర అవసరాలకు స్థలం అనువుగా ఉంది. హైదరాబాద్‌లోని జీడిమెట్లలో దీన్ని కొనుగోలు చేశానని, విలువ రూ.7 లక్షలని యజమాని తెలిపారు. దీనిని ఎక్కడికైనా ట్రాలీ లారీపై తీసుకెళ్లవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో గరిష్ఠ స్థాయికి విద్యుత్ వినియోగం.. యూనిట్‌ ధర రూ.20

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.