ETV Bharat / state

యానాంలో నిర్మాణరంగ కార్మికుల నిరసన - Construction workers protest news

యానాంలో భవన నిర్మాణ కార్మికులు నిరసన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

workers protest
కార్మికుల నిరసన
author img

By

Published : Nov 1, 2020, 1:16 PM IST

ఇసుక తవ్వకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన విధానాలు ప్రవేశపెట్టినప్పటి నుంచి కొరత ఏర్పడింది. కరోనా మహమ్మారి తోడైన కారణంగా నిర్మాణ రంగం పూర్తిగా నిలిచిపోయింది. అనుబంధ రంగాల కార్మికులు సైతం ఇబ్బందులు పడాల్సివచ్చింది. గడచిన రెండు నెలలుగా ప్రభుత్వం ఆన్​లైన్​ ద్వారా ఇసుకను సరఫరా చేస్తున్నా.. వినియోగదారులు ఎన్నో అవస్థలు పడుతున్నారు.

కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో సుమారు 3 వేల కుటుంబాలు భవన నిర్మాణ రంగంలో వివిధ విభాగాల్లో పనులు చేస్తుంటారు. సమీప జిల్లాల్లో ఇసుక కొరతతో నిర్మాణ పనులు జరగట్లేదు. ఫలితంగా.. కార్మికులు అప్పుల్లో కూరుకుపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. అనంతరం వినతిపత్రం అందించారు. పర్యటన నిమిత్తం వచ్చిన పాండిచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావుకు తమ కష్టాలను వివరించారు.

ఇదీ చదవండి:

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అరెస్టు.. తెదేపా శ్రేణుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.