గ్రామ వాలంటీర్ల తొలగిపుంతో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గోవిందపురంలో అధికార వైకాపాలో అసమ్మతి నెలకొంది. గ్రామానికి చెందిన ఇద్దరు వాలంటీర్లను కొందరు వైకాపా నాయకుల ఒత్తిడి మేరకు జగ్గంపేట ఎంపీడీవో అకారణంగా తొలగించారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. వాలంటీర్ల తొలగింపునకు నిరసనగా స్థానిక ట్రావెల్స్ బంగ్లా నుంచి జగ్గంపేట ఎమ్మార్వో కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.
వాలంటీర్ల పనితీరుపై ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదు లేకపోయినా..కొందరు వైకాపా నాయకుల మాటలు విని అన్యాయంగా వారిని తొలగించారని స్థానిక నాయకుడు కొల్లు రామకృష్ణ అన్నారు. ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే స్పందించని కారణంగానే నిరసన ర్యాలీ చేపట్టామన్నారు. కష్టపడిన వారిని గుర్తించకుండా ఎమ్మెల్యే తన అనుచరులకు మాత్రమే పెత్తనం కట్టబెడుతున్నాడని జగ్గంపేట వైకాపా అధ్యక్షుడు కాపవరపు వర ప్రసాద్ విమర్శించారు. అకారణంగా తొలగించిన వాలంటీర్లు బాలరాజు, సోమరాజులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
PAWAN KALYAN: సగటు ప్రజల కన్నీళ్లు తుడవడమే ప్రధాన లక్ష్యం: పవన్